ప్రఖ్యాత పల్లికొండేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీక బహుళ త్రయోదశి సందర్భంగా ధన్వంతరి హోమం, ఆయుష్య హోమం వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ మునిశేఖర్ రెడ్డి తెలిపారు.
దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు శ్రీ పల్లికొండేశ్వరస్వామి దేవస్థానంలొ కార్తీక బహుళ త్రయోదశి సందర్భంగా గురువారం ఉదయం 10 గంటలకు ఈ ప్రత్యేక హోమాలు నిర్వహించారు.
ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మునిశేఖర్ రెడ్డి, సభ్యుల సమక్షములో ఆలయ అర్చకులతో దేవస్థానం కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో దేవస్థానం యాగశాల నందు ధన్వంతరి హోమం మరియు ఆయుష్య హోమం నిర్వహించడం జరిగాయి.
ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్, సభ్యులతో పాటు ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొనడం జరిగినది.
.