భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం, ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని అన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తి మరువలేనిదన్నారు.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దళిత, బహుజనుల ఆశాజ్యోతి అంబేద్కర్ అని అన్నారు.
అనంతరం పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
.