పేదల కష్టాలు చూస్తే ఆయన చలించి పోతారు. తాను ఉన్నానంటూ భరోసా ఇస్తారు. తన వద్దకు వచ్చే పేద వారికి సాయం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఆ మంచి మనసుకు అందరూ వందనం చెబుతున్నారు. ఆ మంచి ఎవరో కాదు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి.
శ్రీకాళహస్తిలో పేద కుటుంబాల్లో పెళ్లిళ్లు జరిగితే తన వంతు సాయం చేస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు. తాజాగా మంగళవారం ఇద్దరు యువతుల ఉన్నత చదువుకు సాయం చేశారు.
ఆ వివరాలు పరిశీలిస్తే… తొట్టంబేడు మండలం రామచంద్రాపురం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన నస్రీన్ తిరుపతిలో ఎంసీఏ చదువుతోంది. కళాశాల ఫీజు కట్టడానికి వారి ఆర్థిక స్థోమత లలేక పోవడంతో ఎమ్మెల్యే బియ్యపు మధును ఆశ్రయించింది.
ఆమె సమస్యను విన్న బియ్యపు మధు వెంటనే ఆమెకుకాలేజీ ఫీజు కోసం రూ.35,000 సాయం చేశారు. ఇంకా ఏమైనా సాయం కావాలంటే తనను నేరుగా వచ్చి కలిసి తెలియజేయాలని సూచించారు. ఎమ్మెల్యే వెంటనే సాయం చేయడంతో నస్రీన్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
అదేవిధంగా తొట్టంబేడు మండలం చిన్నసింగమాల గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన జోష్ణ కు తన ఉన్నత విద్య చదువుకోవాలనే ఆశ. అయితే వారి కుటుంబానికి ఆర్థిక స్థోమత లేక పోవడంతో మంగళవారం ఎమ్మెల్యేను ఆశ్రయించారు. ఎమ్మెల్యేతో తాను ఉన్నతవిద్య చదువుకోవాలని… తన తండ్రి ఆటో నడుపుతూ వచ్చే సంపాదన కుటుంబ ఖర్చులకి సరిపోతోందని తెలియజేశారు.
వెంటనే ఎమ్మెల్యే గారు జోష్ణ చదువు బాధ్యత పూర్తిగా తానే తీసుకుంటానని ఆమెకు భరోసా ఇచ్చారు. బాగా చదువుకొని తన కుటుంబ సభ్యులను మంచిగా చూసుకోవాలని తెలిపారు. తన చదువుకు ఎమ్మెల్యే భరోసా ఇవ్వడంతో జ్యోష్ణ ఆనందభరితురాలైంది.
.