ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు అన్యాయం జరిగేలా ఉన్న ఈ పి ఆర్ సి మాకొద్దని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిలర్ సుమతి, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి కలికిరి పవన్ కుమార్ రెడ్డి అన్నారు
ఎస్టియు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు ఉదయం నగరిలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఆర్సి అమలు వల్ల ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతున్నట్లు కొందరు అధికారులు ముఖ్యమంత్రిని, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తమకు పిఆర్సి అవసరం లేదని, ప్రస్తుత వేతనాలనే కొనసాగిస్తూ ,పెండింగ్ డి ఏ లు మాత్రం ఖచ్చితంగా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
అన్నింటికంటే ముందు సి పీ ఎస్ విధానాన్ని రద్దు చేస్తే చాలని విన్నవించారు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంటి అద్దెలు పెరుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందేనని అయితే చీఫ్ సెక్రటరీ గారు మాత్రం ఇంటి అద్దె భత్యం తగ్గించాలని సూచించటం విడ్డూరంగా ఉందని అన్నారు. కొంతమంది కోవర్టు లీడర్లు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ప్రయోజనాలకు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎస్టియు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మురళి మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రయోజనాలను కాలరాస్తున్న చీఫ్ సెక్రటరీ రిపోర్టును ప్రక్కన పెట్టి అశుతోష్ మిశ్రా గారి రిపోర్టు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
క్షేత్రస్థాయిలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల మనోభావాలు ముఖ్యమంత్రి గారికి తెలియ కుండా కొందరు అధికారులు అడ్డుపడుతున్నారని, తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఫిట్మెంట్ విషయాన్ని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు
ఎవరూ అడగకుండానే పదవీ విరమణ వయస్సును పెంచడం వెనుక ఉద్దేశ్యం వెల్లడించాలని కోరారు .డీఎస్సీ నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు
అనంతరం ఎమ్మార్వో కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు
కార్యక్రమంలో ఎస్టియు నగరి మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు , లక్ష్మీనారాయణ , నాయకులు గణేశన్, పురుషోత్తం, తిరుమలేశం రెడ్డి,రాజశేఖర్ , హేమంత్ కుమార్, రామనాధ్ కుమార్, నాధముని, శ్రీదేవి , లలిత, నాగభూషణం, సెల్వం, రాజేంద్రన్, పాండురంగం, రమేష్, సురేష్, శంకర్, మణి, శివలింగం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్టియు నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు.
.