శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి మాజీ ఛైర్మన్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ ను బుధవారం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి పరామర్శించారు.
కోలా ఆనంద్ తండ్రి కోలా శ్రీనివాసులు నాయుడు (89) బుధవారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు.
ఈ నేపథ్యంలో బియ్యపు మధు పట్టణంలోని కొండమిట్టలో గల కోలా ఆనంద్ ఇంటికి వెళ్లారు. కోలా ఆనంద్ తండ్రి కోలా శ్రీనివాసులు నాయుడు పార్ధీవ దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ధైర్యంగా ఉండాలని కోలా ఆనంద్ కుటుంబ సభ్యులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నేత అంజూరు శ్రీనివాసులు, ఉత్తరాజి శరవణ, కంఠా ఉదయ్ కుమార్, చింతామణి, సూరావారి సురేష్, మున్నా, జయశ్యామ్, ఆశాకిరణ్, ముత్తు, చంద్రరాజు, సునీతాసింగ్, ధన, కల్యాణ్, రవి తదితరులు పాల్గొన్నారు.
.