వైకుంఠ ఏకాదశి పర్వదినంతో పాటు, సంక్రాంతి సెలవుల సీజన్ కూడా ఒకేసారి వస్తుండడంతో.. తిరుమలలో భక్తుల రద్దీ పోటెత్తే అవకాశం ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని.. గదుల ఎడ్వాన్స్ రిజర్వేషన్ ను టీటీడీ రద్దు చేసింది.
కేవలం కరెంట్ బుకింగ్ ద్వారా మాత్రమే ఇస్తారు. ఆ సీజన్లో వీఐపీల తాకిడి కూడా బీభత్సంగా ఉంటుంది. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఎడ్వాన్స్ రిజర్వేషన్ రద్దుచేయడం సామాన్యుల కోసమే అని టీటీడీ చెబుతోంది.
అడ్వాన్స్ రిజర్వేషన్ రద్ధు
తిరుమల శ్రీవారి ఆలయంలో 2021 జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని జనవరి 11 నుండి 14వ తేదీ వరకు వసతి గదుల ఆడ్వాన్స్ రిజర్వేషన్‌ను టిటిడి రద్ధు చేసింది.
శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తుల వసతికి పెద్దపీట వేస్తూ తిరుమలలోని అన్ని గదులను కరెంటు బుకింగ్ ద్వారా కేటాయించాలని టిటిడి నిర్ణయించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
– ఎమ్‌బిసి – 34, కౌస్తుభం విశ్రాంతి భవనం, టిబిసి కౌంటర్, ఎఆర్‌పి కౌంటర్లలో 2021 జనవరి 11వ తేదీ తెల్లవారుజామున 12 గంటల నుండి 14వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు గదులు కేటాయించబడవు.
– జనవరి 11 నుండి 14వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ప్రివిలేజ్ ఉండదు.
– శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులకు వెంకటకళా నిలయం, రామరాజ నిలయం, సీతా నిలయం, సన్నిధానం, గోవింద సాయి విశ్రాంతి గృహాల్లో అలాట్‌మెంట్ కౌంటర్లు ఏర్పాటుచేసి గదులు కేటాయిస్తారు.
– స్వయంగా వచ్చిన ప్రముఖులకు గరిష్టంగా 2 గదులు మాత్రమే కేటాయించబడును.
– సామాన్య భక్తులకు సిఆర్‌వో జనరల్ కౌంటర్ ద్వారా గదులు మంజూరు చేస్తారు.
.