గ్రేటర్ ప్రజలు మరి కొద్దిరోజుల్లో రానున్న గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో చాలా నిర్ణయాత్మకంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నేతలు ఇచ్చే హామీలను చూసి మోసపోకుండా… మీకు తెలిసిన, మీ సమస్యలను ఎరిగిన నేతలను గుర్తించి వారినే ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే… ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఎన్నో తాయిలాలను పార్టీ నాయకులు ప్రకటిస్తారు. అయితే అవి సదరు నాయకులు గెలిస్తేనే కొద్ది రోజులపాటు అమలు జరిపి, తర్వాత చేతులెత్తేసే ప్రమాదం ఉంది. అంటే నాయకులు ఇచ్చిన వాగ్దానాలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని మీరు బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.
అలాకాకుండా ఆపరేషన్ దుర్యోధన సినిమాలో శ్రీకాంత్ లాగా హైదరాబాద్ నగరానికి సముద్రాన్ని తీసుకుని వస్తాను అన్న చందంగా హామీలు ఇస్తే నమ్మేసి, మోసపోకండి…
ఇవీ చదవండి : కేసీఆర్ గారూ.. ఇందులో కిక్ ఏం ఉంటుంది సార్ అన్ని వివరాలూ లాగారు .. ఇక పిలవడమే నాగ్ - అఖిల్ కాంబోలో సెకండ్ మూవీ కుప్పం సమీపంలో జర్నలిస్టు దారుణ హత్య
గతంలో ప్రధాన ఎన్నికలకు ముందు ఉద్యోగస్తులకు పిఆర్ సి ఎర వేశారు. కానీ అనుకున్న సమయానికి పీఆర్ సీ ప్రకటించకపోవడంతో కినుక వహించిన ఉద్యోగ వర్గం ఆయనకు ఎన్నికల్లో చేదు అనుభవాన్ని రుచి చూపింది. దీంతో ఎన్నికలకు ముందు రెండు నెలల్లో పీఆర్ సీ ఇచ్చేస్తా… అన్న అదే ముఖ్యమంత్రిగారు ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా… అసలు పీఆర్ సీ ఇస్తాను అనే విషయం గురించి మాట్లాడడం లేదు… మీ చావు మీరు చావండి… మీరేమీ మాకు ఓటు వేయలేదు కదా… అన్నట్టుగా ఆయన ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్నారు. అలాగే మీకు కూడా ఏదో చేస్తాం… అంటూ వాగ్దానాలు ఇస్తున్నారు… ఒకవేళ మీరు మీ తరహాలో ఓటు వేసి ముఖ్యమంత్రికి షాకిస్తే… తర్వాత మీకు మళ్లీ కళ్లముందు చుక్కలు చూపించి… కళ్లల్లో నీళ్లు రప్పిస్తారేమో… తస్మాత్ జాగ్రత్త…! మీకోసం… మీ సమస్యలకోసం పోరాడే బలమైన నాయకుడిని ఎన్నుకోండి…మీ ఓటును సద్వినియోగం చేసుకోండి!
.

Discussion about this post