ఈరోజు నిండ్ర మండలం IR కండిగ, MSVM పురం గ్రామాలలో మీతో మీ ఎమ్మేల్యే కార్యక్రమం లో ఎమ్మెల్యే పర్యటించారు.
ఈ గ్రామాలలో IR కండిగ, IR కండిగ BC కాలనీ, IR కండిగ AAW లలో, మరియు MSVM పురం, MSVM పురం BC కాలనీ లలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్ళి పలకరించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం గురించి అడిగి తెలుసుకున్నారు.
తరువాత వారి సమస్యలను నోట్ చేసుకుని తక్షణ చర్యలకు వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది తో అక్కడిక్కడే తీర్చగలిగిన వి తీర్చడానికి ఆదేశాలు జారీ చేశారు తీర్చిన తర్వాత తెలియ చేయాలని చెప్పారు.
అదేవిధంగా గా అర్హత వుండి కూడా సంక్షేమ పథకాలు అందని వారు ఎవ్వరు ఉన్నా వారి వివరాలు తీసుకొని సంబంధిత అధికారులకు పంపారు.
Discussion about this post