మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు జిల్లాకు వస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ప్రాజెక్టులకు సంబంధించి నీటి నిల్వలు ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ఫ్లూట్ చూసుకొని విడుదల చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి అన్నారు.
గురువారం సాయంత్రం కార్వేటినగరం మండలం లో కుశస్థలి నది ప్రవాహంతో దెబ్బతిన్న పలు కల్వర్టు లను జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ తో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మొదట రాచపాలెం, ఉడమల కుర్తి గ్రామాలకు వెళ్లే దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. అనంతరం కృష్ణాపురం రిజర్వాయర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మరియు ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నీటి నిల్వలు ఇన్ఫ్లో చూసుకుని విడుదల చేయాలని, అదేవిధంగా ప్రాజెక్టు భద్రతను కూడా చూసుకోవాలని అన్నారు.
1975 లో నిర్మించిన ప్రాజెక్ట్ కు సంబంధించి నీటి విడుదల వివరాలను,కాల్వల సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు సమాధానమిస్తూ ప్రస్తుతం వ్యవసాయ అవసరాలకు నీటిని విడుదల చేయడం లేదని అందుకే నదిలోకి వదలడం జరిగిందని తెలిపారు.
అనంతరం ముక్రవారి పల్లి గ్రామం మీదుగా కొల్లగుంట వరకు కుశస్థలి నదిపై అసంపూర్తిగా బ్రిడ్జి పనులను పరిశీలించారు. దీనికి తిరిగి అనుమతులు రావడం జరిగిందని త్వరలో నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
దెబ్బతిన్న రోడ్ల కు సంబంధించి పునర్నిర్మాణం కోసం అంచనాలు తయారు చేయాలని ఉపముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు అనధికారులు పాల్గొన్నారు.
.