సావిత్రమ్మ.. ఈవిడ అందరికీ తెలియక పోవచ్చు. కానీ పుత్తూరు బాలికల జూనియర్ కళాశాలలో సుమారు
నాలుగు దశాబ్దాలుగా చదివిన విద్యార్థులకు సావిత్రమ్మ సుపరిచితురాలు.
నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సావిత్రమ్మ సేవలను గుర్తించి శుక్రవారం రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పూలే విగ్రహాం ఆవిష్కరణ మరియు ఉపాధ్యాయుల సన్మానం కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు.
పుత్తూరు బాలికల జూనియర్ కళాశాల 1983-84 విద్యా సంవత్సరంలో ప్రారంభం కాగా 1984వ సంవత్సరంలో సావిత్రమ్మ 75 రూపాయల వేతనంతో అటెండర్ గా చేరారు. అప్పటి నుంచి గత 38 సంవత్సరాలుగా బాలికల జూనియర్ కళాశాలలో సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం సెప్టెంబర్ నెలలో సావిత్రమ్మ పదవీ విరమణ చేయనున్నారు
ఈ నేపథ్యంలో నగరి శాసనసభ్యురాలు ఆర్.కె.రోజా గారు సావిత్రమ్మ సేవలను గుర్తించి శాలువా కప్పి పూలమాలతో సన్మానించడం జరిగింది. సావిత్రమ్మ ఆనందోత్సాహాలతో కళ్ళల్లో ఆనందబాష్పాలు కార్చారు.
ఈ సన్నివేశంను చూసిన ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు సావిత్రమ్మను కొనియాడారు.
.

Discussion about this post