ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పని చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న ఆరు నెలలు జీతాలను వెంటనే చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో నెంబర్ 549 ప్రకారం కొత్త జీతాలు చెల్లించాలని నగరి నియోజకవర్గ ఏఐటీయూసీ కార్యదర్శి కోదండయ్య, పట్టణ నాయకులు వేలన్ , భాషా డిమాండ్ చేశారు.
నగరి ఏరియా హాస్పిటల్ లో పనిచేసే కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హాస్పిటల్ లో పని చేయు కార్మికులకు గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకుండా సంబంధించిన కాంట్రాక్టర్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నది. అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు.
కాంట్రాక్టర్లు జీతాలు అడిగితే ప్రభుత్వం మాకు బిల్లులు ఇవ్వలేదు , కాబట్టి జీతాలు ఇవ్వలేము. ప్రభుత్వం బిల్లులు ఇచ్చినప్పుడు జీతాలు ఇస్తామని చెప్పడం అన్యాయం, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని కార్మికులకు జీతాలు ఇచ్చే విధంగా చర్యలకు తీసుకోవాలని కోరారు,
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 549 జీవో ప్రకారం 16000 జీతాలు ఇవ్వాలి. పీఎఫ్ ఈఎస్ఐ డబ్బులు సక్రమంగా చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
అనంతరం సూపర్డెంట్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సూపర్డెంట్ మాట్లాడుతూ సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి వారం రోజుల్లో జీతాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది,
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్ , నవోమి, ఉష, ఆశ, సుమతి, మల్లికమ్మ, సుజాత Selvi. కార్మికులు పాల్గొన్నారు.
.