నగరి ఇందిరమ్మ వార్డులో మొదట్లో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలు వారికే కేటాయించాలని నగరి సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, పట్టణ కార్యదర్శి వేలన్, బాషా డిమాండ్ చేశారు.
నగిరి ఇందిరమ్మ వార్డులో పట్టణంలో ఉన్న పేదలకు 2008 లో ఇంటి స్థలాలు కేటాయించడం జరిగింది, 434 మందికి ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది.
ఇంటి స్థలాలు కేటాయించిన వారిలో అనేక మంది నిరుపేదలు కాబట్టి కుటుంబ పోషణ భారంగా ఉన్నందున, సరిగా పని లేకుండా ఉన్నందున వారికి కేటాయించిన స్థలంలో ఇల్లు నిర్మాణం చేసుకోలేకుండా పోయినారు, ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు కొంతమంది ఆక్రమణ చేసుకోవడం జరిగింది,
దీనిపైన సిపిఐ పార్టీ అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకు వచ్చినా సమస్య పరిష్కారం కాలేదు, అక్టోబర్ 2021 లో కొంతమందికి ఇంటి స్థలాలు చూపించిన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు ఇది మాది అని వచ్చి అభ్యంతరం తెలుపుతున్నారు.
రెవెన్యూ అధికారులు వచ్చి పట్టా ఇచ్చిన స్థలాన్ని చూపించిన ఇళ్ల నిర్మాణం చేసుకోవటానికి లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి స్థలాన్ని కేటాయించిన చోట ఇల్లు నిర్మించుకునే దానికి చర్యలు చేపట్టాలని నాయకులు కోరారు,
అనంతరం స్థానిక ఎమ్మార్వోకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ 2008లో ఇచ్చిన పట్టా ప్రకారం ఇల్లు నిర్మించుకోవాలని లబ్ధి దారులకు ఎమ్మార్వో హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులతో పాటు సికిందర్ బాయ్, అలీ కరిముల్లా, సరే ఉద్దీన్, అల్లావుద్దీన్, బాధితులు పాల్గొన్నారు.
.