ప్రజలు ఎన్నుకుని అసెంబ్లీ కు పంపిస్తే నగరి ప్రజల సమస్యలు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించకుండా నగరి ఎమ్మెల్యే జగన్ భజన చేసిందని, దీంతో స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు అడగాలని ఎమ్మెల్యేకు గుర్తు చేసే పరిస్థితి ఏర్పడడం నగరి ప్రజల దురదృష్టం అని నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గాలి భాను ప్రకాష్ విమర్శించారు..
నగరి జిఆర్ఎన్ కళ్యాణ మండపంలో జరిగిన నగరి రూరల్ మండల తెలుగుదేశం పార్టీ ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు.
నగరి ప్రజలను రోజా కుటుంబం జలగల్లా పీల్చుకుని తింటున్నారు
ఓ వైపు వరదలకు ప్రజలు తీవ్రంగా నష్టపోతే,రోడ్లు దెబ్బతింటే పట్టించుకోకుండా జగన్ స్మరణ చేసేదానికే ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు..
మొన్న ఎమ్మెల్యే రోజా తీరు అసెంబ్లీలో స్పీకరుకే విసుగొచ్చింది. భారీ వర్షాలకు రోడ్లు,బ్రిడ్జులు కొట్టుకుపోయి ప్రజలు అవసస్థలు పడుతుంటే ఈమే సమస్యలే లేవు అన్నట్టు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలే లేవు అన్నట్టు జగన్మోహన్ రెడ్డిని పొగుడుతుంది.ఇది చూసిన నగరి ప్రజలు ఈమెని గెలిపించినదానికి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారన్నారు.
ఒక పక్క త్రాగునీరు,రంగునీరు సమస్య మరోపక్క చక్కెర ప్యాక్టీరిలో చెరుకు తోలిన రైతులు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు.ఈ ఎమ్మెల్యే,వైస్సార్సిపి ప్రభుత్వం జలగ లాగా ప్రజల రక్తాన్ని పీల్చుకు తింటుంది.
రాపోయేది మన తెలుగుదేశం ప్రభుత్వమే మీరు ఎవ్వరు అధైర్య పడకండని అని కార్యకర్తలకు భానుప్రకాష్ సూచించారు. ప్రజలెవ్వరూ ఓటిఎస్ కట్టొద్దు,తెలుగుదేశం వస్తుంది పసుపు కుంకుమ పెట్టి ఉచితంగా రిజిస్ట్రేషన్ లు చేయిస్తాం అన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి ఆర్.మీరా, నగరి రూరల్ పార్టీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు, మాజీ జడ్పీటీసీ వెంకటరత్నం, సురేష్ నాయుడు, బాలాజీ, గుణ, రామ్మూర్తి, నారాయణ స్వామి, శ్రీనివాసులు రెడ్డి, జవహర్ రెడ్డి లు పాల్గొన్నారు.
.