నగరి మండలంలో సావిత్రీ బాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ APUTF ఆధ్వర్యంలో ప్రథమమండలంలోని మహిళా ఉపాధ్యాయినీ మణులకు మహిళా ఉపాధ్యాయినీ దినోత్సవాన్ని శ్రీమతి సావిత్రీబాయీ పూలే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని )ఘనంగా సన్మాన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరి బాలికొన్నత పాఠశాల , ప్రధానోపాధ్యాయులు నమశ్శివాయం విచ్చేసి మహిళలను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో UTF జిల్లా కౌన్సిల్లెర్ P. R. మ్యూనిరత్నం మాట్లాడుతూ ఉద్యమాలు బలహీన పడుతున్న ఈ రోజుల్లో మహిళల పాత్ర ఇప్పుడు చాలా అవసరమని చెప్పారు.
మహిళలు ముందుండి సమస్యలపై పోరాడాలని ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షలు జనార్దన్ ,ప్రధాన కార్యదర్శులు రవీంద్రబాబు, కుప్పరాజు, శ్రీనివాసులు, చంద్రశేఖర్, సంతోష్ కుమార్ , ఇతర UTF నాయకులు పాల్గొన్నారు.
.