మహిళలు రూపాయి రూపాయి పొగుచేసి కట్టిన డబ్బును నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి దొడ్డి దారిన నిధులు మళ్లించడం న్యాయమేనా అని రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి ఆర్.మీరా నిలదీశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలకు మూలస్థంభంలాంటి డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారని విలేకయుల సమావేశంలో విమర్శించారు.
విత భీమా సంస్థ అయిన ఎల్ఐసి కి అభయహస్తం పథకానికి ఎటువంటి సంబంధం లేదు అని బహిరంగ ప్రకటన చేయడం ద్వారా ప్రభుత్వం యొక్క దోపిడీ బట్టబయలైంది. రెండు వేల కోట్ల నిధులను వెనక్కి తీసుకొని విద్యా దీవెన కింద ఇవ్వడం ఎంత వరకు సబబు అని ఆమె ప్రశ్నించారు.
వృద్ధాప్యంలో భరోసాగా ఉంటుందని కడితే ఆ ఆశలపై నేను ముఖ్యమంత్రి నీళ్లు చల్లాడు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా? అని మీరా నిలదీశారు.
నేడు ముఖ్యమంత్రి అన్ని కార్పొరేషన్ నిధులు మళ్లించేసేసాడు, ప్రభుత్వ భూములను తనకా పెట్టేసాడు, మద్యం బాండ్ల ద్వారా అత్యధిక వడ్డీకి అప్పు తీసుకొచ్చాడు, ఉపాధ్యాయ పోస్టులని తనకా పెట్టి అప్పు తీసుకొచ్చాడు ఇవి చాలదని నేడు మహిళలు పెడుపు చేసుకున్నా పొదుపు డబ్బులను కూడా లాక్కోవలని ప్రయత్నించడం సిగ్గు చేటు అన్నారు.
మీరు ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి వెళ్లి సహాయం అడిగితే మహిళలే పదివేలు అంతకన్నా ఎక్కువ ఇచ్చి రాష్ట్రాన్ని అదుకుంటారని మీరా ఉచిత సలహా ఇచ్చారు. చివరకి రాష్ట్రాన్ని మా మహిళలే ఆదుకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తెచ్చాడన్నారు.
ఈ సమావేశంలో చిత్తూరు పార్లమెంటు మహిళ అధికార ప్రతినిధి నిరోష, నగరి నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు సంపూర్ణమ్మ, పట్టణ మహిళ కార్యదర్శి సంగీత, చిత్తూరు పార్లమెంటు కార్యదర్శి బాలాజీ, పట్టణ అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి శ్రీనివాసన్, రూరల్ పార్టీ అధ్యక్షుడు శివ కుమార్ రెడ్డి, జ్యోతి నాయుడు సురేష్ నాయుడు, బాలాజీ, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
.