నయీమ్ డైరీస్ పేరుతో గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవితం కథాంశంగా ఒక చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఇది ప్రస్తుతం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మరో మాజీ నక్సలైట్ దామూ బాలాజీ.. కథను తయారుచేసుకోవడంలో భాగంగా గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవితం గురించి చాలా రీసెర్చి చేశారు. చాలా విషయాలను సినిమాలో పొందుపరిచారు. ఆదర్శిని డాట్ కామ్ పాఠకులకోసం ఆయన పంచుకున్న విషయాల్లో ఇది ఒకటి..
పోలీసులకు లంచం ఇవ్వాలంటే సామాన్యులకు ఆ విధానం ఏమిటో.. తరీకా ఏమిటో తెలియదు. అందుకే పోలీసులకు లంచాలు ఇవ్వడానికి, వారిద్వారా మన పనులు సానుకూల పరచడానికి సాధారణంగా దళారీలు ఉంటారు. ఎవరో కొందరు పోలీసు డిపార్టుమెంటు మనుషుల ఆనుపానులు తెలిసిన వారు మాత్రం స్వయంగా తామే బేరం మాట్లాడుకుంటారు.
పోలీసులతో పరిచయాలు, సంబంధాల విషయంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్ కు తిరుగేలేదు. అతను నక్సలైటు అవతారం నుంచి మాజీ అయి.. గ్యాంగ్ స్టర్ మారడం అన్నదే పోలీసుల ప్రోద్బలంతోనే జరిగింది. అయితే ఆ తర్వాతి దందాలు యథేచ్ఛగానే కొనసాగిస్తూ వచ్చాడు. ఓ చిన్న ఉదాహరణ వింటే.. నయీమ్ స్టైల్ లంచాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది.
ఓ సారి నయీమ్ అనుచరుడి స్కూటరును తనిఖీ చేస్తూ పోలీసులు అందులో లైసెన్సులేని గన్ ను కనుగొన్నారు. సహజంగానే అతడిని అదుపులోకి తీసుకుని గన్ తో సహా, స్టేషనుకు తరలించారు. సంగతి నయీమ్ చెవిన పడింది.
సాధారణంగా పోలీసుల్లో పెద్దలతో కూడా పరిచయాలు ఉండే ఇతరులెవరైనా.. ‘పైనుంచి’ చెప్పించుకుని.. తమ వాడిని బయటకు తెప్పించుకుంటారు. కానీ నయీమ్ తరీకానే వేరు. నేరుగా సదరు ఎస్ఐకు ఫోన్ చేసి- ‘‘ఇంకా ఎన్నాళ్లు ఆ మారుతి 800 వాడుతావు.. నేను కొత్త శాంత్రో పంపిస్తున్నా తీసుకో’’ అంటూ తాళం చెవి పంపేశాడు. ఆ రోజుల నాటికి ఆ స్థాయిలో ప్రలోభ పెట్టి ఊరించడం అనేది చిన్న సంగతేమీ కాదు! తక్షణం అతని పని జరిగిపోయింది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
గ్యాంగ్‌స్టర్ నయీమ్ పోలీసులకు ఇచ్చే లంచాల వ్యవహారాలు అన్నీ ఇదే తరహాలో ఉండేవని తెలిసిన వాళ్లు అంటుంటారు. సాధారణంగా నయీమ్ కొత్త ఫ్లాటు తాళం చెవులు, కొత్త కారు తాళం చెవులు పోలీసులకు కానుకలుగా ఇస్తూ వారిని లోబరచుకుంటాడనేది ఎక్కువగా వినిపిస్తుంటుంది.
అలాంటి గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవితం ఆధారంగా వశిష్ట సింహా హీరోగా సిఎ వర్దరాజు నిర్మించిన ఈచిత్రం త్వరలో విడుదల కాబోతోంది.
also read :అద్దె ఇల్లు యజమానుల్ని బెదిరిస్తున్న అధికారులు
కుప్పం వెళ్లే హక్కు చంద్రబాబుకు లేదా?
మంత్రి హరీష్ రావుకు తప్పిన ప్రమాదం
ఇంట్లో పాముల్ని వదలి.. బడా నిర్మాతకు బెదిరింపులు
.

Discussion about this post