అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని అఖిల పక్ష నేతలు డిమాండ్ చేశారు. సాంకేతిక సమస్యలు వున్నాయి, మళ్ళీ పూర్తి స్థాయి లో బిల్లు పెడతామని మూడు రాజదానుల ప్రస్తాపన తీసుకు వస్తే సహించేది లేదని హెచ్చించారు.
శుక్రవారం తిరుపతి సీపీఐ కార్యాలయం లో అఖిల పక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు అధ్యక్షత న జరిగింది.
9 వ తేదీ చిత్తూరు జిల్లా లోకి మహా పాద యాత్రకు ఘన స్వాగతం పలుకుతామని నేతలు నిర్ణయించారు. 17 వ తేదీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.
అమరావతి పరిరక్షణ సమితి జే ఏ సి నాయకులు తిరుపతి రావు మాట్లాడుతూ ఆనాడు రాజదాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని అన్నారు. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి అమరావతి రాజదాని గా ఒప్పుకున్నారని గుర్తు చేశారు.
నేడు మూడు రాజదానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారనీ పేర్కొన్నారు. టెక్నికల్ సమస్యలు వున్నాయని మూడు రాజదాను ల బిల్లు ఉపసంహరించు కుని మళ్ళీ పూర్తి స్థాయిలో తీసుకొస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు.
పాద యాత్ర 29 గ్రామాల భూముల కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ శాసన మండలి లో బలం పెరిగింది కాబట్టి తిరిగి మూడు రాజదానుల బిల్లు పెట్టే అవకాశం ఉందని అన్నారు. దీనిని న్యాయ పోరాటం కూడా సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అమరావతి రాజదాని గా వుండాలి అన్నారు.
ఈ నెల 9 వ తేదీ అమరావతి రైతుల పాదయాత్ర చిత్తూరు జిల్లా కు వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతామని చెప్పారు. 17 వ తేదీ తిరుపతి లో 50 వేల మంది తో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు పులివర్తి నాని మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా 34 వేల ఎకరాలు రైతులు రాజదాని కోసం ఇవ్వడం జరిగింది అన్నారు. మెజారిటీ వుంది కదా అని వైసిపి నాయకుల ఆర్థిక లబ్ది కోసం మూడు రాజధానుల అంశం తీసుకొచ్చారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని ఏది అంటే నేటికీ ప్రభుత్వం చెప్పే పరిస్థితి లేదన్నారు. అమరావతి రాజదాని కోసం పోరాటం సాగిస్తామని తెలిపారు.
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య మాట్లాడుతూ అమరావతి లో రైతులు పోరాటం చేస్తే చట్టాల్లో వున్న అన్ని సెక్షన్ లు మోపి కేసులు పెట్టారని అన్నారు. రాజదాని లో బిల్డింగ్ లు అహంకారం తో కూలదూసారని విమర్శించారు. పాద యాత్ర కు అడుగడుగునా అడ్డు పడటం రాక్షస పాలన కు నిదర్శనం అన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ రాజదాని అమరావతి నే వుండాలని రైతులు చేస్తున్న పోరాటం చారిత్రకం అన్నారు. తిరుపతి లో బహిరంగ సభ కు న్యాయ స్థానం అనుమతి ఇవ్వాలని కోరారు.
తెలుగు దేశం పార్టీ తిరుపతి పార్ల మెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ అమరావతి నీ రాజదాని నీ బావి తరాలకు అన్నీ విధాల ఉపయోగ పడే విధంగా అభివృద్ధి చేయాలని చంద్ర బాబు సంకల్పిస్తే దానిని ఎలా నిర్వీర్యం చేయాలని జగన్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి నీ రాజదాని గా ప్రకటించే వరకు పోరాటం చేస్తామని అన్నారు.
సీపీఐ నగర కార్యదర్శి విశ్వనాథ్, ఏఐటీయూసీ నాయకులు మురళి, రాధాకృష్ణ, రవి, రాజా, రైతు సంఘం కార్యదర్శి పి ఎల్ నరసింహులు, కుమార్ రెడ్డి, శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి చిన్నం పెంచలయ్య, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంజుల, నదియా, రత్నమ్మ, విజయ, ఏఐవైఎఫ్ నాయకులు రామక్రిష్ణ, తెలుగు దేశం పార్టీ నాయకులు సప్తగిరి ప్రసాద్, రమణ, మదు,రవి తదితరులు పాల్గొన్నారు.
.