కార్పొరేట్ కాలేజీలకు దీటుగా శ్రీకాళహస్తి ఆలయ అనుబంధంగా ఏర్పాటు చేసిన స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల కు పూర్వ వైభవం పాలకులు అనుకుంటే ఎందుకు రాదు అని జై భీమ్ ఆర్మీ నాయకుడు పులి శ్రీకాంత్ ప్రశ్నించారు.
ఇంజనీరింగ్ కళాశాలలో చదివిన ఎంతో విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని అలాంటి కళాశాల ను మూసివేయడం బాధాకరమన్నారు.
ఈ ఇంజనీరింగ్ కాలేజీ ఈ పరిస్థితి రావడానికి కళాశాల అధ్యాపకుల సమన్వయలోపం గ్రూప్ రాజకీయాలు చేశారని శివయ్య సొమ్ములతో సాగుతున్న కళాశాలకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవని చెప్పారు.
అలాంటి కళాశాలను కొంతమంది ప్రబుద్ధులు వలన ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజా ప్రతినిధులు పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం కళాశాలకు పూర్వవైభవం తీసుకురావాలని కోరారు.
.