టీటీడీ లో సస్పెండ్ చేసిన ముగ్గురిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేసింది.
టిటిడి లో సస్పెండ్ చేసిన నాగార్జున, వెంకటేష్, గుణశేఖర్ లను వెంటనే ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ నాయకులు ఎం రమేష్ సత్యవేడు మండల కేంద్రంలో తాసిల్దార్ ఆఫీస్ లో డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది రోజులుగా తిరుపతిలో టిటిడి లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ హక్కుల కోసం నిరసన తెలియజేస్తూ ఉంటే జగన్ ప్రభుత్వం కళ్ళుండీ చూడలేని రీతిగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికుల న్యాయమైన కోరికలు తీర్చాలని వారు ఆందోళన చేస్తుంటే టీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మద్దతు తెలియజేయడంతో కక్షపూరితంగా వారిని సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని అన్నారు.
ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
సిఐటియు జిల్లా కమిటీ పిలుపుమేరకు సత్యవేడు సిఐటియు మండల కమిటీ తరఫున ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.
అనంతరం తాసిల్దార్ శ్రీదేవి గారికి అర్జీ సమర్పించారు ఈ నిరసన కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు అరుణాచలం సిఐటియు నాయకులు రమేష్ మునిస్వామి రామచంద్రయ్య రవి నిర్మలమ్మ శాంతి కాంతమ్మ వరలక్ష్మి సుబ్బలక్ష్మి చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
.