సత్యవేడు మండలం ఏవిఎం గ్రామానికి చెందిన రామచంద్రయ్య కుటుంబానికి న్యాయం చేయాలనీ సత్యవేడు సిపిఎం పార్టీకి మండల కార్యదర్శి రమేష్ డిమాండ్ చేయడం జరిగినది.
శుక్రవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో రామచంద్రయ్య కుటుంబ సభ్యులతో రమేష్ సమావేశం నిర్వహించి వారికి భరోసానివ్వడం జరిగినది.
ఈ సందర్బంగ రమేష్ మాట్లాడుతూ ఏవిఎం గ్రామానికి చెందిన రామచంద్రయ్య భూమి సమస్యను స్థానిక ఎంపిటిసి భర్త గురునాధం, మాజీ సర్పంచ్ గురునాధంలు అనవసరంగా వివాదాస్పదం చేయడం జరిగుతుందన్నారు.
రామచంద్రయ్యకు చెందిన 95 / 8 లోని 90 సెంటులలో ఉన్న టేకు, కొబ్బిరి చెట్లను స్థానిక ఎంపిటిసి భర్త గురునాధం, మాజీ సర్పంచ్ గురునాధంలు అన్యాయం నరికి వేయడంతో గతంలో పొలిసు కేసుకూడా నమోదు కావడం జరిగినదన్నారు.
తమ పై పొలిసు కేసు పెట్టారు అని రామచంద్రయ్య భార్య కొట్టడం తో వారి పై మరో కేసు నమోదు కావడం జరిగినదన్నారు. ఇదండి జీర్ణించుకోలేని ఎంపిటిసి భర్త గురునాధం, మాజీ సర్పంచ్ గురునాధంలు వీరిని ఎలాగైనా నాసినం చేయాలనీ, స్థానిక జపిటిసి, ఎంపీపీ వద్ద కు వెళ్లి నిజాలను దాచి వారికీ లేనిపోని అపద్ధాలను రామచంద్రయ్య పై చెప్పడం జరిగినదన్నారు.
కావున స్థానిక అధికారులు, పోలీసులు, జపిటిసి, ఎంపీపీ రామచంద్రయ్య సమస్యను సమగ్రంగా విచారించి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు.
.
.