మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ నేతల ఛలోక్తులు పేలుతున్నాయి. ఆయనను ఒక్కొక్కరు ఒక్కో రేంజిలో ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా తనదైన శైలిలో చంద్రబాబుపై విమర్శలు రువ్వారు.
చంద్రబాబును సన్యాసం తీసుకోమంటున్న ఆదిమూలం.. ఆ తర్వాత.. ఖాళీ టైంలో ఏం చేయాలనే విషయంలో కూడా చంద్రబాబుకు ఒక ఉచిత సలహా ఇస్తున్నారు. ఇంతకీ ఆయన సలహా ఏంటో తెలుసా..? రాజకీయ సన్యాసం తీసుకున్నాక.. ఎంచక్కా మనవడితో ఆడుకుంటూ పొద్దు పుచ్చాలట..!
చంద్రబాబు నాయుడు కాళ్లు పైకి లేపి చేతుల మీద ఇంటింటిటికీ తిరిగినా కూడా మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు.
ఆదివారం నాగలాపురం లో రైతులకు సబ్సీడి కింద వేరు శేనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా బాబు తీరు పై మండి పడ్డారు.
కుప్పంలో పార్టీ పూర్తిగా తుడుచుకుని పోవడంతో తీవ్ర మనోవేదనకు గురై తమ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
తక్షణమే బాబు రాజకీయ సన్యాసం తీసుకుని మనుమడుతో ఇంటి పట్టున ఉండి పోవడం చాలా మంచిదని హితవు చెప్పారు. నవరత్నాలు అందరికీ చేరిందని, అయితే పేదలకు ఎంతో ఉపయోగ కరమైన ఓ టీ యస్ పధకంను అడ్డుకోవడం, వాటిపై విమర్శలు చేయడం బాబుకు తగని పనిగా ఆయన మండిపడ్డారు.
కార్యక్రమంలో అధికారులు, వైయస్సార్ సీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
.