సార్వత్రిక బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాలలో భాగంగా ప్రగతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లోని 25 పాఠశాలల్లోని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర, కొడుకు ఆకర్ష్ రెడ్డి పాల్గొన్నారు.
ముందుగా అతిథులకు ప్రగతి స్వచ్ఛంద సేవా సంస్థ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
కార్యక్రమం అనంతరం పవిత్ర పిల్లలతో మమేకమై వారికి కావల్సిన సదుపాయాలను అడిగి తెలుసుకొని త్వరలోనే అన్ని పాఠశాలల్లో విద్యార్థులు అడిగిన సదుపాయాలను సమకూరుస్తామని హామీ ఇచ్చారు.
బడిఈడు పిల్లల కి కావాల్సిన సౌకర్యాలు అన్నిటినీ మన ముఖ్యమంత్రి గారు సమకూర్చారని తెలిపారు.వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు విద్యార్థులు చేరాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రగతి స్వచ్ఛంద సేవా సంస్థ వారు మరియు వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు
.