దివ్య కాశి_ భవ్య కాశి కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో కాశీ-విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించిన సందర్భంగా దేశం అంత కూడా ఈ కార్యక్రమాన్ని దేవాలయాల నందు ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నేడు దక్షిణకాశీగా పేరు గాంచిన మన శ్రీకాళహస్తి పవిత్ర పుణ్యక్షేత్రంలోని బ్రహ్మగుడి ఆవరణలో ఆలయ ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి, శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇంఛార్జి శ్రీ ఆనందకుమార కోలా ఆధ్వర్యంలో పట్టణ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు దివ్య కాశీ – భవ్య కాశీ ప్రత్యక్షప్రసారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కోలా ఆనందకుమార నియోజకవర్గ బీజేపీ పార్టీ కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని కాశీ విశ్వనాథ ధామం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు..
ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షులు కాసరం రమేష్, బీజేపీ నాయకులు గరికపాటి రమేష్, మన్నసముద్రం చెంగల్రాయులరెడ్డి, కొండేటి గోపాల్, కోనేటి అయ్యప్ప, రవి ఆచారి, రమేష్, క్రిష్ణయ్య ప్రజ్ఞశ్రీ, పద్మజా, పట్టణ యువమోర్చా సభ్యులు చందురాయల్, సజ్జా హరి, భరత్ నాయుడు,కొండమిట్ట రవి, గాలి రమేష్ నాయుడు, గిరినంద సాయి, నాని, ఢిల్లీ, కుమార్, తదితరులు పాల్గొన్నారు…
.