విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడమే లక్ష్యమని సమగ్ర శిక్ష జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శివశంకరయ్య అన్నారు.
తొట్టంబేడు మండలంలోని గుండేలిగుంట., చోడవరం, శేషమనాయుడు కండ్రిగ, పూడి ప్రాథమిక పాఠశాలలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఈ కంటెంట్ బోదన తప్పనిసరిగా అందించాలన్నారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ ప్రార్థనా సమయంలో ఫోటోలు అప్ లోడ్ చేయాలని సూచించారు.
విద్యార్థులందరూ జగనన్న విద్యా కానుక వినియోగించేలా చూడాలని చెప్పారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అమలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని పేర్కొన్నారు.
పాఠశాల రికార్డులను పరిశీలించారు. అనంతరం పూడి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ గణిత దినోత్సవం లో ఆయన పాల్గొన్నారు.
సీఆర్పీలు మునిమోహన్., మునస్వామిరెడ్డి., ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
.