దక్షిణ కాశీగా ఖ్యాతి గాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంలో ముక్కంటి ఆలయానికి సంబంధించిన అతిధి గృహాల్లో గదులు దొరకాలంటే పలుకుబడి ఉండాల్సిందే.
ముక్కంటి ఆలయానికి సంబంధించి జ్ఞానప్రసూనాంబ సదన్, త్రినేత్ర అతిథి గృహం, భక్తకన్నప్ప సదన్, భరద్వాజ సదన్ తో పాటు లోబావిలో ఓ అతిథి గృహం ఉంది.
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చే భక్తులు.. ఆలయానికి సంబంధించిన అతిథి గృహాల్లో ఉండటానికి మక్కువ చూపుతారు. ఇందుకు కారణం విశ్వాసం, అంతేగాకుండా ప్రైవేటు లాడ్జీలతో పోల్చుకుంటే ఇక్కడ అద్ధె తక్కువ. మెరుగైన వసతులు ఉంటాయి.
ఈ కారణాలతో భక్తులు వీటిలో ఉండాలనుకుంటారు. అయితే అతిధి గృహాల్లో పని చేసే ఉద్యోగులు పలుకుబడి ఉన్నవారికి మాత్రమే గదులు ఇస్తుంటారనే బలమైన విమర్శ ఉంది. సామాన్య భక్తులు ఎవరు వెళ్లినా.. ‘గదులు ఖాళీ లేవు’ అనే సమాధానం వస్తుంటుంది.
దీంతో సామాన్య భక్తులు ప్రైవేటు లాడ్జీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇదే అదనుగా ప్రైవేటు లాడ్జీల వారు భక్తులను దోచుకుంటున్నారు. ఈ విషయం ఆలయ అధికారులకు తెలిసినా… తగు చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు.
సామాన్య భక్తుల సమస్యలను, నమ్మకం దృష్టిలో ఉంచుకుని ఆలయ అతిథి గృహాల్లో సామాన్య భక్తులకు కూడా గదులు కేటాయించే విధంగా ఉద్యోగులకు తగు సూచనలు ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ అధికారుల ఆదేశాలు ఉల్లంఘిస్తే వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని ప లువురు కోరుతున్నారు.
.