సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ రంగాల్లో అత్యంత వెనుకబడిన వడ్ఢెర కులస్థులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ కుల కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ దేవళ్ల మురళి డిమాండు చేశారు. తిరుపతి నగరం తిరుచానూరు రోడ్డులో గల మహిళా ప్రాంగణంలో ఆదివారం చిత్తూరు జిల్లా ముఖ్య నేతల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దేవళ్ల మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరతరాలుగా వడ్డెరలు బాగా వెనుకబడి ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోక పోవడం బాధాకరమన్నారు. వడ్డెర కారపోరేషన్ ఛైర్మన్ గా తాను ఉన్నపుడు కుల అభివృద్ధికి తన వంతు కృషి చేసినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
తనకు వ్యక్తి గతంగా ఈ పదవి దక్కలేదని… వడ్డెర కులస్థుల కారణంగానే టీడీపీ అధిష్టానం తనకు ఈ బాధ్యతలు అప్పగించిందని చెప్పారు. వడ్డెరల అభివృద్ధికి రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.
త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును కలిసి వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసే విధంగా ఒత్తిడి చేస్తామన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపారని… అయితే ఆ తరువాత తమ గోడు ఎవరు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చొరవ తీసుకుని… వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఇందుకోసం రాష్ట్రంలోని వడ్డెరలు అందరూ ఐకమత్యంగా పోరాటం చేయాలని కూడా ఆయన పిలుపు నిచ్చారు.
అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులుగా డేరంగుల నారాయణ, ఉపాధ్యక్షులుగా ఎం.రెడ్డిశేఖర్, ఎం.వీ. రమణ, ఆర్ సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శిగా వడ్డే రవీంద్రరాజు, కార్యదర్శిగా వలిపి శ్రీరాములు, ప్రచార కార్యదర్శిగా కోనంగి శ్రీరాములు, అధికార ప్రతినిధులుగ జి.మదన్మోహన్, వై. జగన్నాథం, జిల్లా యువత అధ్యక్షులుగా వై.హరిబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
.

Discussion about this post