మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పార్ధీవ దేహానికి ఎమ్మెల్యే భూమన నివాళి అర్పించారు.
రాజకీయకురువృద్ధుడురోశయ్య మరణం తెలుగు రాష్ట్రాల కు తీరని లోటు అని భూమన పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భూమన… హైదరాబాద్ లో శనివారం ఉదయం రోశయ్య పార్ధీవ దేహానికి నివాళి అర్పించారు.
సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్ గా ప్రజలకు ఎనలేని సేవలు అందించిన రాజకీయ దురంధరుని మృతి విచారకరం అని అన్నారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ, ప్రజలకు విశేష సేవలందించిన రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రోశయ్య గారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
.

Discussion about this post