టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 2021-22వ విద్యాసంవత్సరానికి గాను రెండు సంవత్సరాల వ్యవధి గల డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సులో డిసెంబరు 21, 22వ తేదీల్లో కౌన్సెలింగ్‌కు నేరుగా హాజరై అడిషన్లు పొందవచ్చు.
డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ బైపిసి మరియు ఎమ్‌పిసి విద్యార్థినీలు మాత్రమే అర్హులు.
మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
వీరికి ఎటువంటి వయోపరిమితి లేదు. కోర్సులో చేరిన వారికి ఉచిత హాస్టల్ మరియు భోజన సౌకర్యం కల్పిస్తారు.
మరింత సమాచారం కొరకు 9299008151, 9247575386 నంబరులో కార్యాలయం వేళల్లో సంప్రదించగలరు.
.
Discussion about this post