వైసీపీ పాలనలో ముస్లింలకు ఒరిగింది శూన్యమని టీడీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం ఆర్గనైజింగ్ కార్యదర్శి షాకీరాలీ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం శ్రీకాళహస్తి పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్డాడారు.
తనపై ఎంతో నమ్మకంతో మైనార్టీ విభాగం ఆర్గనైజింగ్ కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుకు.. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఈ పదవి రావడానికి సహకరించిన మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, శ్రీకాళహస్తి నియోజవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు.
ముస్లింలు అందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు ఎన్నో పథకాలు ఉండేవన్నారు. ప్రతి రంజాన్ కు ముస్లింలకు రంజాన్ తోఫా అందచేసే వారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రంజాన్ తోఫాకు మంగళం పాడేశారని విమర్శించారు.
ఇలా చేయడం వలన పేద ముస్లింలు అనేక ఇబ్బందులు పడుతున్నారని షాకీరాలీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టీడీపీ హయాంలో పేద ముస్లింల కోసం దుల్హన్ పథకం ప్రవేశ పెట్టి… వివాహ ఖర్చుల కోసం రూ.50వేలు ఆర్థిక సాయం చేసే వారని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ పథకం కూడా రద్దు చేశారని ఆయన చెప్పారు.
జగన్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను… మైనార్టీ వ్యతిరేక విధానాలను అందరూ గమనిస్తున్నారని… సరైన సమయంలో వైసీపీకి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. ముస్లిం ఓట్లతో గద్దె నెక్కిన జగన్ ఇపుడు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని షాకీరాలీ ప్రశ్నించారు.
ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఖలీల్ భాషా, కార్యదర్శి అస్మత్, పట్టణ మైనారిటీ అధ్యక్షులు షఫీ, మీర్జా, జిలానీ భాషా, కరీం, ఖాదర్ భాషా, మస్తాన్, ఖాదర్, సీ ఎస్ మస్తాన్ తదితర మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
Discussion about this post