తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి.. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఆహా అద్భుతంగా సక్సెస్ అయింది. తాజాగా వాళ్లో పెద్ద వేడుక కూడా నిర్వహించారు. అయితే.. ఆహా ఓటీటీలో ఉన్న బూతు కంటెంట్మొత్తం వదిలించుకోవాలని.. పరిశుద్ధ ఓటీటీ వేదికగా కొత్తగా అవతరించాలని వారు అనుకుంటున్నారట. ఆహా ఓటీటీలో శృంగారం కాస్త ఎక్కువై.. సెక్స్ ను డైరక్ట్ గా టచ్ చేస్తూ.. అడల్ట్ కంటెంట్ తో ఉండి ఎపిసోడ్లు, మూవీలు అన్నీ తొందర్లోనే గాయబ్ అయిపోవచ్చు. యాజమాన్యం నిర్ణయం తొందర్లోనే అమలవుతుందని సమాచారం.
ఆహా ఓటీటీ ప్లాట్ఫాం ప్రారంభించినప్పుడు.. అప్పటికి ఓటీటీ మరియు ఆన్ లైన్ రంగాల్లో ఏ విషయానికి ఎక్కువ ఆదరణ ఉంటుందా? అనే ఒకే ఒక్క పాయింట్ పట్టించుకున్నారు. అడల్ట్ కంటెంట్ ఒక్కటే ప్రధానంగా దూసుకుపోయారు. కుటుంబంతో కలసి చూడడానికి ఇబ్బంది పడేంత సెక్స్ కంటెంట్ నింపేశారు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు వ్యూస్ పరంగా.. అంతా బాగానే ఉంది. వ్యూస్ బాగున్నాయి. కానీ వారికి అది పరువు తక్కువ వ్యవహారం అయింది.
తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ప్రత్యేక కథనాలు.. ఇవీ చదవండి : తుంగభద్ర అంటే.. ఆదివరాహస్వామి స్వేదం.. ఆ విశేషం మీకు తెలుసా? పుష్కరం అంటే పన్నెండేళ్లకు ఓసారి వచ్చే పండుగ పుష్కరాల్లో ఎలాంటి పనులు చేయాలో తెలుసా? ఏయే నదులకు ఎప్పుడెప్పుడు పుష్కరాలు వస్తాయో తెలుసా?
ఆహా ప్లాట్ ఫాం లో కీలక భాగస్వాముల్లో అల్లు అరవింద్, జూపల్ల రామేశ్వరరావు వంటి వారున్నారు. జూపల్లి రామేశ్వరరావు అంటే.. వ్యాపార రంగంలో దిగ్గజంగా ఉన్న ఖ్యాతికంటే.. మంచి సాంప్రదాయ పరాయణుడైన ఆధ్యాత్మకి వాదిగా.. చినజీయర్ భక్తుడిగా ఎక్కువ పేరుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు అల్లు అరవింద్ కు కూడా అలాంటి కీర్తి ప్రతిష్టలే ఉన్నాయి. అడల్ట్ కంటెంట్ అమ్ముకుని డబ్బు సంపాదించుకునే నిర్మాతల కేటగిరీలు వేరే ఉంటాయి. అదే సమయంలో అల్లు అరవింద్ కు ఉన్న కీర్తి వేరు. ఇలాంటి వారి సారథ్యంలో ఆహా ప్లాట్ ఫాం బూతు ప్లాట్ఫాంలాగా తయారు అయ్యేసరికి వారికి చెడ్డ పేరు వచ్చింది.
నెమ్మదిగా ట్రెండ్ మార్చి.. బూతు కంటెంట్ తగ్గించే ఆలోచనలో పడ్డారు. మామూలు తరహాలో ఉండే వెబ్ సిరీస్, ఫిలింస్ ఎంచుకున్నారు. ఎంత చేసినా వారి పాత బూతు కంటెంట్ మొత్త అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఆ మొత్తం బూతు కంటెంట్ ను కడిగేసుకుని.. క్లీన్ ఇమేజి తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నారట. ఆహా అంటే.. అందరితో ఆహా అనిపించుకునే ఓటీటీ ప్లాట్ ఫాం తయారు చేయాలనే ఆలోచనతో అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
.
Discussion about this post