వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముళ్ళపూడి గిరిజన కాలనీ వాసులకు బియ్యం, బ్రెడ్ లు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి మండలంలోని నారాయణ పురం పంచాయతీ ముళ్ళపూడి గిరిజన కాలనీలో పరిస్థితి గురించి.. స్థానిక సి. పి.ఐ. ఏరియా కార్యదర్శి జనామల గురవయ్య వే ఫౌండేషన్ వారి దృష్టికి తీసుకెళ్లారు.
వారి సమాచారం మేరకు ప్రతి కుటుంబానికి 5 కె. జి. బియ్యాన్ని మరియు బ్రెడ్లను వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య అందజేశారు.
గత 10 రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అనేక గ్రామాలు నీట మునిగాయి. రాకపోకలు నిలిచిపోయాయి.
ఉపాధి కరువై నిస్సహాయ స్థితిలో ఉన్న ముళ్ళపూడి గిరిజనులకు సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించిన వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.పైడి అంకయ్య ని జనమాల గురవయ్య అభినందించారు.
డా. పైడి అంకయ్య మాట్లాడుతూ విపత్తు జరిగినప్పుడు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సి. పి.ఐ. నాయకులు గోపి, అమ్మేపల్లి వినయ్ కుమార్, పవన్,వంశీ, ఏ. ఐ. ఎస్. ఎఫ్. నాయకులు సురేష్, చందు, ఏ. ఐ.వై.ఎఫ్. నాయకులు గణేష్, మల్లికార్జున్, నాగ సురేష్,యానది సంగం రాష్ట్ర అధ్యక్షులు చందమామల కోటయ్య, ప్రజనాట్య మండలి గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
.