ఆయనో పోలీస్ కానిస్టేబుల్. ఇప్పటికే ఆయనకు పెళ్ళయింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా వలంటీరుగా పని చేసే ఓ యువతిని తన మాయ మాటలతో ప్రేమలో దించాడు. ఆ యువతిని వంచనకు గురి చేశాడు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వివాదమైంది.
పంచాయతీ పేరుతో పిలిపించి.. యువతి కళ్ల ముందే ఆమె తండ్రిని చితక బాదాడు. ఈ అవమానం భరించలేక యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ఫడింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గురువారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాళహస్తి పట్టణం దక్షిణ కైలాసనగర్ కు సాంబశివరావు, నాగిణి దంపతుల కుమార్తె ఉమామహేశ్వరి (21) పురపాలక సంఘం పరిధిలోని 9వ వార్డు పరిధిలో వలంటీరుగా విధులు నిర్వర్తించేది. వీరిది చాలా నిరుపేద కుటుంబం. సాంబశివరావు పెయింటరుగా పని చేస్తుంటాడు. ప్రస్తుతం ఉమామహేశ్వరి సంపాదనతోనే వీరి కుటుంబం నడుస్తోంది.
ఇదిలా ఉండగా… శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే ప్రసాద్ కూడా దక్షిణ కైలాస్ నగర్ లో ఉమామహేశ్వరి కుటుంబం ఉండే ప్రాంతంలోనే నివాసం టున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఉమామమేశ్వరిని పెళ్లి చేసుకుంటానని నమ్మంచి ప్రసాద్ ఆ యువతిని వంచనకు గురి చేశాడు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వివాదమైంది.
ఈ నేపథ్యంలో ప్రసాద్ కుటుంబ సభ్యులు ఇటీవల ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఈ వివాదం తీర్ఛడానికి బుధవారం పట్టణంలోని లోబావిలో పంచాయతీ నిర్వహిద్దామని ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులకు ప్రసాద్ సూచించాడు. దీంతో ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు లోబావి వద్దకు వెళ్లారు. అక్కడ పంచాయతీ నిర్వహించారు.
ప్రేమ పేరుతో తనను మోసం చేసినందుకు పెళ్లి చేసుకోవాలని ఉమామహేశ్వరి పట్టు పట్టింది. అయితే ప్రసాద్ అందుకు అంగీకరించలేదు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. యువతి తండ్రి సాంబశివరావుపై ప్రసాద్ చేయి చేసుకున్నాడు. దీంతో ఉమామహేశ్వరి తీవ్ర మనస్తాపానికి గురైంది. తన వలన తండ్రికి అవమానం జరిగిందని వేదన చెందింది. పంచాయతీ అర్థంతరంగా ముగించుకుని.. వారందరూ ఇంటికి వచ్చేశారు.
తనకు జరిగిన అవమానం.. మోసం తలచుకుని మానసిక వేదనకు గురైన ఉమామహేశ్వరి తన బుధవారం రాత్రి తన ఇంటిలో అందరూ నిద్రించిన తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనపై ఉమామమేశ్వరి తండ్రి సాంబశివరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమామహేశ్వరి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్సత్రికి తరలించారు.
.
Discussion about this post