వర్షపాతంతో బాధపడుతున్న ప్రజలకు తమవంతు సేవ చేయాలని సేవాభావంతో శ్రీకాళహస్తి పట్టణంలోని
ఏనుగుల గుంట కాలనీ నందు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి, కుమారుడు ఆకర్ష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పవిత్ర రెడ్డి మాట్లాడుతూ ప్రార్థించే చేతులకన్నా సాయం చేసేచేతులు మిన్న అన్నరీతిలో లయన్స్ క్లబ్ వారు నిత్యావసర సరుకులను పలుచోట్ల అందజేశారని అన్నారు.
ఈ నేపథ్యంలో నేడు ఎనుగులాగుంట కాలనీ బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలియజేశారు,
భారీ వర్షాల వలన బాధపడుతున్న ప్రజలు వారికి ఎటువంటి కష్టం వచ్చినా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొనివస్తే, వారి సమస్యలు పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపడతారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ వైస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
.