శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా తేది.16.12.2021 నుండి తేది.15.01.2022 వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి.
ఆలయ వేళలు మరియు ఆలయం నందు జరుగు కార్యక్రమ వివరములు ఇలా ఉన్నాయి.:
ఉదయం 3.00 గంటలకు పురవీధుల్లో జేగంట పంపుట, 4.00 గంటలకు మంగళవాయిద్యములు, 4.15 గంటలకు తిరుమంజనము ఉంటాయి.
4.30 గంటలకు గోపూజ, పళ్లియర పూజ (సుప్రభాతం లేదు), తేవారం, 5.00 గంటలకు ప్రథమ కాల అభిషేకం (సేవలు లేవు), 6.00 గంటలకు ద్వితీయ కాల అభిషేకం (సేవలు లేవు) నిర్వహిస్తారు.
7.00 గంటలకు పరివారం దేవతా నైవేద్యం, 7.30 గంటలకు గొబ్బి ఉత్సవము, 10.00 గంటలకు ఉచ్చికాల అభిషేకం, సాయంత్రం 4.00 గంటలకు ప్రదోష కాల అభిషేకం జరుగుతాయి.
శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం రోజులలో రాత్రి 9.00 గంటలకు, మంగళవారం, బుధవారం, గురువారం రోజులలో రాత్రి 8.30 గంటలకు పళ్లియర పూజ ఉంటుంది..
.