అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆయన విగ్రహానికి వినతిపత్రం సమర్పించింది. ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది.
రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారంటూ వినతిపత్రంలో పేర్కొన్నారు.
తెలుగుదేశం సమర్పించిన వినతిపత్రం ఇలా ఉంది.
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి,
విషయం: రాజ్యాంగం ద్వారా మీరు కల్పించిన జీవించే హక్కును కాలరాస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం – ఒటిఎస్ పేరుతో వేధింపులు – ప్రజల హక్కులను కాపాడాల్సిందిగా విన్నవించుట గురించి.
అయ్యా,
భారతదేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషిచేసిన మీరు పరమపదించి 65సంవత్సరాలు పూర్తయింది. మీరు ఏ లక్ష్యంతో ప్రపంచంలోనే అత్యుత్తమైన రాజ్యాంగాన్ని ఈ దేశప్రజలకు అందించారో, ఆ స్పూర్తికి విరుద్దంగా నేడు ఆంధ్రప్రదేశ్ లో పాలన జరుగుతోంది.
బడుగు, బలహీనవర్గాల హక్కులను కాలరాస్తూ మీరు మాకు ఇచ్చిన స్వేచ్చను జగన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం హరిస్తోంది. బడుగు, బలహీనవర్గాలు ఈ సమాజంలో జీవించే హక్కును కల్పిస్తూ మీరు ముందుచూపుతో రాజ్యాంగంలో ఆర్టికల్ -21ను పొందుపర్చారు.
అయితే నేడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం జిఓ నెం.82 విడుదలచేసి ఓటిఎస్ పేరుతో డబ్బు చెల్లించాలని వేధిస్తూ జీవించే హక్కును హరించే విధంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దళితులపై పెద్దఎత్తున దాడులకు దిగుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా మాపై ఉక్కుపాదం మోపేలా వ్యవహరిస్తోంది.
రెక్కాడితే గానీ డొక్కాడని మాపై డబ్బుల కోసం నేటి ప్రభుత్వ పెద్దలు జులుం చెలాయిస్తున్నారు. హక్కుల కోసం ప్రశ్నించిన వారి గొంతునొక్కే విధంగా పోలీసులను ప్రయోగిస్తూ రాజ్యహింసకు పాల్పడుతున్నారు. ఈ అరాచక ప్రభుత్వం ఆగడాలను నుంచి కాపాడేందుకు మరోమారు మీరు ఈ భువిపై అవతరించి కాపాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు విజయకుమార్ .. కంటారమేష్… బషీర్… జిలానీ… షాకీర్ అలీ… ప్రవీణ్.. మస్తాన్.. మిన్నల్ రవి… యాదగిరి… ఆర్ముగం.. వెంకటేశ్వర్లు… ఏం ఎస్ రెడ్డి తదితరులు.పాల్గొన్నారు
.