భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అణగారిన వర్గాల వారి సాధికారత కోసం, దేశ నిర్మాణం కోసం వారు అందించిన సేవలను బిజెపి నాయకులు స్మరించుకున్నారు.
బిజెపి తిరుపతి పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు చంద్రప్ప శ్రీకాళహస్తి పట్టణంలోని స్వగృహంలో అంబేద్కర్ కు నివాళి అర్పించారు.
బిజెపి రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమ, బిజెపి తిరుపతి పార్లమెంటు జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఉమా సింగ్ తదితరులతో కలిసి అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.
.