కరువుభత్యాలులు మంజూరు కానిదే., PRC ఇచ్చినా ప్రయోజనం ఉండదని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ (R. J. U. P) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు M. శ్రీనివాసరావు., K. కిషోర్ కుమార్ లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో 3 D. A లకు జీవోఇచ్చిన విషయం గుర్తు చేశారు.
5.1% డీఎ జనవరి 2022 న జీవో ప్రకారం ఇవ్వాల్సి ఉంది. ఇది ఫిబ్రవరి లో నగదు రూపం లో రావాల్సి ఉంది. ఈ దశ లో PRC ఇస్తే 5.1% డీఏ సంగతి ఏమిటని వారు ప్రశ్నించారు.
జనవరి డీఏ ఇచ్చిన తర్వాత పీఆర్సీ ఇస్తే ఆ D. A 5శాతం పీఆర్సీలో కలవడం వల్ల మూలవేతనం 5% పెరుగుదల తో పాటుగా 30 నెలలు అరియర్స్ కూడా వస్తుంది అని తెలిపారు.
కావున ముందు D. A లు ఇచ్చి తర్వాత PRC ఇవ్వాలని కోరారు.
.