ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్ లతో శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనరు బి. బాలాజీ నాయక్ శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు.
సదరు సమావేశములో కమిషనరు వారు మాట్లాడుతూ తొలగించిన భవనముల శిధిలాలను గవర్నమెంట్ ఆసుపత్రి మెయిన్ రోడ్డు ఇరువైపులా పోయడం వలన రోగులు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ లో ఆసుపత్రికి వెళ్లే సమయములో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అన్నారు.

ఆస్పత్రి వైద్యాధికారులు తెలియజేసియున్నందున తొలగించిన భవన శిధిలాలను సదరు రోడ్డు మార్గము నందు వేయుట నిషేధించుటమైనదని తెలియజేశారు.
ప్రత్యామ్నాయంగా తొలగించిన భవనాల శిధిలాలను స్వర్ణముఖిలోని దక్షిణ కైలాస ముక్తిధామము నందు వేయాలని తెలియజేయడమైనది.
గవర్నమెంట్ ఆసుపత్రి మెయిన్ రోడ్డు మార్గమున సి.సి. కెమెరాలను ఏర్పాటు చేయడమైనది. కావున, ప్రతి ఒక్కరూ
ఆ రోడ్డులో తొలగించిన భవనముల శిధిలాలను వేసినచో పురపాలక సంఘ చట్టము మేరకు కఠిన చర్యలు తీసుకొనబడునని తెలియజేయడమైనది.
.