శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగినది.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, శ్రీకాళహస్తి కోర్టు పరిధిలో ఉన్న అన్ని శాఖల అధికారులు, సిబంది పాల్గొన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి అరుణ మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవడానికి సహకరిస్తూ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేయాలని, “రాజీమార్గమే రాజ మార్గంగా” ఎన్నుకొని ఎక్కువ కేసులని పరిష్కరించడానికి దోహద పడాలని కోరారు.
న్యాయమూర్తి రాఘవేంద్ర మాట్లాడుతూ.. రాజమార్గంలో కక్షిదారులతో ప్రత్యక్ష పద్దతిలో కేసుల పరిష్కార పద్ధతే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ లోక్ అదాలత్ కి కోర్టులో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసుల్లో కక్షిదారులను ఒప్పించి అధిక సంఖ్యలో వాటిని రాజమార్గంలో పరిష్కరించడానికి సమిష్టి కృషి అవసరమని తెలిపారు.
.