జననేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 49 వ జన్మదినం సందర్భంగా రేణిగుంట బస్టాండ్ వద్ద మండల పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు.
అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా పవిత్ర మాట్లాడుతూ జననేత జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పండగ వాతావరణం లో జన్మదిన వేడుకలు జరిగాయి అని తెలిపారు.
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జగన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2004 నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగానే ఈ సంవత్సరం తోపుడు బండ్లు, ట్రై సైకిళ్లు, పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు.
రాష్ట్రంలో మహిళలకు ఆరాధ్య దేవుడు ఉన్న జగనన్నకు మహిళలు అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
.