సమాజంలో తరతరాలుగా అణచబడుతున్న వర్గాలకు ఎర్రజెండా అండగా నిలబడుతోందని భారత కమ్యూనిస్టు పార్టీ చిత్తూరు జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య చెప్పారు.
సీపీఐ 97వ ఆవిర్భావ వేడుకలు ఆదివారం తిరుపతి గ్రామీణ పరిధిలోని ముత్యాలరెడ్డిపల్లె సీతమ్మనగర్ లో నిర్వహించారు. ఇక్కడ చిన్నం పెంచలయ్య సీపీఐ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్య హక్కుల కోసం, దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులతో పోరాడి నిలిచిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అన్నారు. ఈ పార్టీ 1925 డిసెంబర్ 26వ తారీఖున ఆవిర్భవించిందని గుర్తు చేశారు సీపీఐ ఎర్ర జెండా కింద అనేక మంది పేదలకు న్యాయం జరుగుతోందన్నారు.
తిరుపతి సీతమ్మ నగర్ పేదలకు అండగా ఉంటూ కాపాడుతోదని… భవిష్యత్తులో కూడా ఈ కాలనీలో మౌలిక వసతుల ఏర్పాటు కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఎర్ర జెండా ఆధ్వర్యంలో కొన్ని దేశాలు పరిపాలన చేయడం హర్షించదగిన విషయమన్నారు.
మతోన్మాద బీజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం తుంగలో తొక్కి అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి మతోన్మాద శక్తుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్ పల్లి సీతమ్మ నగర్ శాఖ కార్యదర్శి కేటీ చలం రెడ్డి , మార్స్క్ నగర శాఖ కార్యదర్శి ఆర్. బలరాం , శివ, మేరమ్మ , బాబురావు తదితరులు పాల్గొన్నారు .
.