భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ముని మనవడు డాక్టర్ రాజారత్నం అశోక్ అంబేద్కర్ ర్యాలీని జయప్రదం చేయాలని జైభీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులి శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు.
జైభీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో ఆదివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పులి శ్రీకాంత్ మాట్లాడుతూ… తన అభ్యర్థన మేరకు రాజారత్నం అశోక్ అంబేడ్కర్ ఈ నెల 28న శ్రీకాళహస్తికి విచ్చేస్తున్నట్లు చెప్పారు.
భారత స్వాతంత్ర్యానంతరం మొట్టమొదట సారిగా అంబేడ్కర్ కుటుంబానికి చెందిన శ్రీకాళహస్తి పట్టణానికి వస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు పట్టణంలోని ఏపీ సీడ్స్ వద్దనుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని శ్రీకాంత్ చెప్ఫారు.
ఈ ర్యాలీకి కులమతాలకు , రాజకీయ పార్టీలకు అతీతంగా, అంబేద్కర్ వాదులు, బహుజనులు, మహిళలు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికి, మన ఐక్యతను చాటు కోవాలని శ్రీకాంత్ కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ధర్మయ్య, యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షులు చందమామ కోటయ్య, జై భీమ్ ఆర్మీ నాయకులు కన్నలి రమేష్, కాగితాల మధు , షేక్ బషీర్, దారా పాండు తదితరులు పాల్గొన్నారు.
.