చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన నంద మెడికల్స్ అధినేత నందకు అందరూ వందనాలు తెలియ చేస్తున్నారు. ఆయన సేవా గుణాన్ని పలువురు కొనియాడుతున్నారు.
ఆదర్శిని డాట్ కామ్ ప్రచురించిన ఓ వార్తాకథనాన్ని చదిావిన నంద చలించిపోయారు. ఉదారంగా స్పందించారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి వీల్ ఛెయిర్ ను కానుకగా అందించారు.
ఇందుకు సంబంధించి వివరాలు పరిశీలిస్తే..
తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన రమేష్ అనే అంగవైకల్యం గల భక్తుడు ఆదివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం కోసం విచ్చేశాడు. బ్యాటరీ కారులో ఆయన మహాద్వారం సమీపంలోని ధ్వజస్తంభం వరకు వెళ్ళాడు. అక్కడ నుంచి వీల్ ఛైర్ లో ఆలయం లోపలకు వెళ్లాల్సి ఉంది.
అయితే అక్కడ ఆలయ అధికారులు ఆయనకు విరిగిన వీల్ ఛైర్ ఇచ్చారు. దానిలో లోపలకు వెళ్లలేక పోయాడు. ఈ కారణంగా శివయ్యను దర్శించుకోకుండానే రమేష్ వెనుదిరిగాడు. ఈ విషయాన్ని ఆదర్శిని డాట్ కామ్ ‘శివయ్యా నీ దర్శనం ఎలా స్వామీ’ అనే శీర్షికతో అందించింది.
ఈ సమస్యపై ‘ఆదర్శిని’లో కథనం రావడంతో నంద మెడికల్స్ యజమాని నంద స్పందించారు. అంగవైకల్యం భక్తుల సౌకర్యార్థం కొత్త వీల్ ఛైర్ ను ముక్కంటి ఆలయానికి సోమవారం వితరణగా ఇచ్చారు. నంద దాతృత్వాన్ని పలువురు కొనియాడారు.
కొవిడ్ విజృంభించిన వేళ కూడా నంద లక్షలాది రూపాయలు విలువ చేసే మందులు, మాస్కులు, శానిటైజర్లు శ్రీకాళహస్తి పట్టణ వాసులకు ఉచితంగా అందజేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
అంతేగాకుండా పేదలకు సాయం చేయడంలో ఆయన ముందుంటారని కొనియాడుతున్నారు. నందను ఆదర్శంగా తీసుకుని సేవ చేయాలని కూడా అంటున్నారు.
.