కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో ఘనంగా నిర్వహించారు.
ఆ పార్టీ జెండా ఆవిష్కరించి వందనం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సురేంద్రరెడ్డి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర మరువలేనిదన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదానన్నారు. ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిన ఇరవై సూత్రాల పథకంతో దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ పార్టీ పని చేస్తోందన్నారు. పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ తదతరులు పాల్గొన్నారు.
.