భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుప్పా ప్రసాద్ ను గురువారం శ్రీకాళహస్తి పట్టణంలోని కైలాసగిరికాలనీలో పలువురు పరామర్శించారు.
తొట్టంబేడు మండలం కనపర్తికి చెందిన కుప్పా ప్రసాద్ శ్రీకాళహస్తి పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఆయన సతీమణి కుప్పా ప్రసన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కర్మక్రియలు శుక్రవారం శ్రీకాళహస్తిలో జరిగాయి.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమ, , తిరుపతి పార్లమెంటరీ నియోజగకవర్గం భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు, కిసాన్ మోర్చా జిల్లా ఇన్చార్జ్ చంద్రప్ప,
శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు తదితరులు కుప్పా ప్రసాద్ ను పరామర్శించారు.
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
.