అమ్మను గౌరవించినట్లే అమ్మభాషను కూడా గౌరవించాలని ప్రధానోపాధ్యాయురాలు కత్తి రాజేశ్వరి అన్నారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్ పీ బీ ఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం
భాషోత్సవాలలో భాగంగాగా తెలుగుభాష పై విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
అదేవిధంగా తెలుగు భాష గొప్పదనం తెలిపే వ్యాసరచన పోటీలు జరిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఏర్ఫాటు చేసిన కార్యక్రమంలో కత్తి రాజేశ్వరి మాట్లాడుతూ… అమ్మభాష అన్నింటికంటే చాలా గొప్పదన్నారు. మాతృభాషలో విద్యాబోధన జరగడం వలన విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడం చాలా సులభమని ఆమె అభిప్రాయపడ్డారు.
మాతృబాష మానసిక వికాసానాకి తోడ్పడుతుందన్నారు. ఎవరి అమ్మవారికి గొప్పదని… అలాగే ఎవరి భాష వారికి గొప్పదన్నారు. మన సంస్కృతి, ఆచారం,కుటుంబ పద్దతులు అన్నీ మాతృభాషలోనే మనకు పరిచయం అవుతాయన్నారు.
వ్యక్తి జీవన పరమార్ధిక విషయాలు మాతృభాషలో అర్ధమైనట్టుగా మరొక భాష ద్వారా అవగాహనకు అంత సులభంగా రావన్నారు. మన మాతృబాష అయిన తెలుగు గొప్పదనం గురించి ఎందరో కవులు, రచయితలు చాలా కాలం నుంచి తెలియ చేస్తున్నారని ఈ సందర్భగా రాజేశ్వరి గుర్తు చేశారు.
తెలుగు భాష తియ్యదనం… తెలుగుజాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక మూలధనం అన్నారు. తల్లి, తండ్రి నేర్పిన మాతృ భాషను మరచి పోతే… వారిని మరచినట్టేనన్నారు. అందుకు అమ్మభాషను ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
.