భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఆ పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉపాధ్యక్షులు, జిల్లా కిసాన్ మోర్చా ఇంఛార్జి, కేవీబీపురం మండల ఇన్ ఛార్జి చంద్రప్ప అన్నారు.
కేవీబీపురం మండల కార్యవర్గ సమావేశాన్ని మండల అధ్యక్షులు ముని శేఖర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు.
ఇందులో భాగంగా మొదట సావిత్రీబాయి పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రప్ప మాట్లాడుతూ… ఏపీలో బీజేపీని బలోపేతం చేనయడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని కోరారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు పోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రణాళికా బద్దంగా పార్టీని బూతు స్థాయిలో ఇప్పటి నుంచే బలోపేతం చేస్తే… భవిష్యత్తులో ఏపీలో బీజేపీ తప్పకుండా అధికారం దక్కించుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటయ్య, సీనియర్ నాయకులు వెంకటముని యాదవ్, మండల ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం, మండల ప్రధాన కార్యదర్శి వెంకట కృష్ణయ్య, మునిరాజ, కార్యదర్శి రమణయ్య, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు వెంకట రమణ, ఓబీసీ మోర్చా అధ్యక్షులు బాలకృష్ణ, ఉపాధ్యక్షులు గోవర్ధన్, కిసాన్ మోర్చా అధ్యక్షులు హరినాయుడు, యువమోర్చా అధ్యక్షులు వెంకటేష్, స్వచ్ఛభారత్ కన్వీనర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
.