మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని శాశ్వతంగా నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య ఆరోపించారు.
ఈమేరకు ఆయన బుధవారం శ్రీకాళహస్తి మండలం ఉరందూరు గ్రామ సచివాలయం కార్యదర్శికి బీకేయంయూ జిల్లా నాయుకులతో కలసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం 2022 – 23 ఆర్థిక సంవత్సరం కు విడుదల చేసిన బడ్జెట్ లో ఉపాధి హామీ పథకాన్నికి తక్కువ నిధులు కేటాయించడం శోచనీయమన్నారు. ఉపాధి హామీ పనులు సక్రమంగా జరగాలంటే పథకానికి 2 లక్షల 40 వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలన్నారు.
జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని కోరారు. రోజు వేతనం రూ. 600లు… 200 రోజులు పని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని కుంటి సాకులు చూపించి పథకానికి తూట్లు పొడవాలని చూస్తే మోదీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ తో కనీసం 50 రోజులు కూడా పని కల్పించలేని పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయ పడ్డారు . జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు లో జరిగే అవినీతిని అరికట్టాలని డిమాండు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏరియా అధ్యక్ష కార్యదర్శులు జె . తులసీ రాజన్ , మించల శివ కుమార్ , రుద్రపాకు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు .
.