ఐ ఎఫ్ టి యు నాయకత్వంలో సమ్మెలో పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్మికులు ఆశ బిడ్డే మేలు మిడ్ డే మీల్ ఆటో హమాలి కార్మికులు అఖిల భారత రైతుకూలీలు ల పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలో లోభారీ ర్యాలీ!
నేడు, రేపు కార్మిక హక్కుల కోసం, దేశ భద్రత కోసం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో ఐ.ఎఫ్.టి.యు స్వతంత్రంగా పాల్గొంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తొట్టంబేడు ప్రాజెక్ట్‌ల అంగన్వాడీ వర్కర్లు మినీ వర్కర్లు హెల్పర్లు ఆశా మిడ్ డే మీల్ ఆటో హమాలి కార్మికులు అఖిల భారత రైతుకూలీ సంగం కార్మికులు శ్రీకాళహస్తి ఆర్టీసీ దగ్గర అంబేద్కర్ విగ్రహం నుండి మహా ప్రదర్శన నాలుగు మాడ వీధులు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కమిటీ సభ్యురాలు గుడ్లూరు భారతి, సంక్రాంతి వెంకటయ్య గంగయ్య అంగన్వాడి జిల్లా నాయకులు శోభ ప్రమీల కల్పన స్వర్ణ జహీరా పార్వతి మణి శ్రీ ఉష జ్యోతి శాంతకుమారి సుదర్శన నాయకత్వం వహించారు . నిర్వహించారు.
ర్యాలీ అనంతరం కార్మికులను ఉద్దేశించి రామిశెట్టి వెంకయ్యమాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రభుత్వ రంగాన్ని తెగ నమ్ముతున్నదని, కార్మిక చట్టాలను రద్దు చేసి, లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని, ఈ కోడ్ లు అమలులోకి వస్తే కార్మికులు తమ హక్కులు సౌకర్యాలు కోల్పోతారని, శ్రమదోపిడికి వేతన దోపిడీకి గురి అవుతారని, పని భారం పనిగంటలు పెరుగుతాయని, బానిసల కంటే హీనంగా బతకాల్సిన రోజులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రద్దు చేసిన కార్మిక చట్టాలు కొనసాగించాలని, లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత రైతాంగం పోరాడిన స్ఫూర్తితో కార్మిక వర్గం పోరాడాలని, తమ హక్కులు సౌకర్యాల కోసం సమర శంఖం పూరించాలి అని పిలుపునిచ్చారు.
రైల్వేలు, బ్యాంకింగ్, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, bpcl, హెచ్‌పిసిఎల్, iocl, ఓడరేవులు, విమానయానం, విద్యుత్ రంగం, బొగ్గు రంగం, రహదారులు, చివరికి రక్షణ రంగాన్ని కూడా మోడీ ప్రభుత్వం ప్రవేట్ పరం చేయాలని చూస్తోందని, ఆ సంస్థలను కాపాడుకోవడం కోసం దేశ ప్రజలంతా సంఘటితంగా పోరాటం పోరాడాలని పిలుపునిచ్చారు. పాల్గొన్నవారు మన్నెమ్మ జమున దిల్షాద్ కృష్ణవేణి నాయకులు పాల్గొన్నారు.
.