ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కోట చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాత చిత్తూరు జిల్లాలోనే కాకుండా.. కొత్త తిరుపతి జిల్లాలో కూడా బలహీన వర్గాలకు చెందిన అత్యధిక జనాభా ఉన్న నియోజకవర్గం శ్రీకాళహస్తి. అని ఆయన పేర్కొన్నారు.
అలాంటి నియోజకవర్గంలో బలహీన వర్గాల ఆశాజ్యోతియైన మహాత్మా జ్యోతిభాఫూలే విగ్రహం లేకపోవడం చాలా బాధాకరమన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పట్టణంలోని రామ సేతువు వద్ద జ్యోతి రావు పూలే విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చరన్నారు.
అయితే అది ఆచరణకు నోచుకోలేదని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆ తరువాత అటు టీడీపీ..ఇటు వైసీపీ బీసీ నాయకులు మరచిపోయారన్నారు.
సమాజానికి బ్యాక్ బోన్ క్లాస్ గా చెప్పబడే బ్యాక్ వర్డ్ క్లాస్ సామాజికవర్గం వారు… బలహీన వర్గాలకు చెందిన నాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోలేని దుస్థితిలో బీసీల నాయకులు ఉన్నారంటే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బీసీ నాయకుల మధ్య ఐక్యత లేకపోవడమే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇప్పటికైనా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని బలహీనవర్గాలకు చెందిన నాయకులు మహాత్మా జ్యోతిబాఫూలే విగ్రహ ఏర్పాటుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన డిమాండు చేశారు.
.